జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన గోకరాజు రంగరాజు!
- మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తనయుడు రంగరాజు
- గంగరాజు సోదరులు సైతం వైసీపీలోకే!
- తనపై అసత్య ప్రచారం అంటూ గంగరాజు అసహనం
అంతకుముందు గోకరాజు గంగరాజు సైతం వైసీపీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. దీనిపై ఆయన స్పందించారు. వైసీపీలో చేరుతోంది తన కుమారుడు రంగరాజు, తన సోదరులు మాత్రమేనని వెల్లడించారు. తన వివరణ తీసుకోకుండా పార్టీ మారుతున్నానంటూ ఏకపక్షంగా ప్రచారం చేయడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు.