కామారెడ్డిలో చెట్టును ఢీ కొన్న కారు... నలుగురి మృతి
- భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో ప్రమాదం
- మృతుల్లో ఇద్దరు మహిళలు
- మృతులు నిజామాబాద్ జిల్లా నవీపేట వాసులుగా గుర్తింపు
మృతులను నిజామాబాద్ జిల్లా నవీపేట వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన కారులో మృతదేహాలు ఇరుక్కుపోవడంతో గ్యాస్ కట్టర్తో కారు భాగాలను విడదీసి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.