కామారెడ్డిలో చెట్టును ఢీ కొన్న కారు... నలుగురి మృతి

  • భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో ప్రమాదం
  • మృతుల్లో ఇద్దరు మహిళలు
  • మృతులు నిజామాబాద్ జిల్లా నవీపేట వాసులుగా గుర్తింపు
కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఓ కారు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు సహా నలుగురు మృతి చెందారు. మృతుల పేర్లు లావణ్య (35), రోషిణి (14), సుశీల్ (28), ప్రశాంత్ (26)గా పోలీసులు గుర్తించారు.

మృతులను నిజామాబాద్ జిల్లా నవీపేట వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన కారులో మృతదేహాలు ఇరుక్కుపోవడంతో గ్యాస్ కట్టర్‌తో కారు భాగాలను విడదీసి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Go Back to Shorts
car accident
Road Accident
Kamareddy District

More Telugu News