ఒడిశాలో చెలరేగిపోయిన కామాంధులు.. ఒకే రోజు ఐదు అత్యాచార ఘటనలు!

  • చిన్నారులను కూడా వదలని మృగాళ్లు
  • బాధితుల్లో ఐదేళ్ల చిన్నారి
  • దిశ నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాతా మారని మృగాళ్లు
ఒడిశాలో కామాంధులు రెచ్చిపోయారు. రాష్ట్రంలో ఒకే రోజు వేర్వేరు చోట్ల ఐదు అత్యాచార యత్నాలు జరిగాయి. మయూరభంజ్ జిల్లా బాదంపహాడ్ ప్రాంతంలో 16 ఏళ్ల బాలికపై నారాయణ మండల్ (25) అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాం జిల్లా కళ్లికోట్‌లో జరిగిన మరో ఘటనలో నాలుగేళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. బాలేశ్వర్ జిల్లాలో జరిగిన ఇంకో ఘటనలో బాలికపై యువకుడు అత్యాచారం యత్నం చేశాడు.

రాజధాని భువనేశ్వర్‌లో 45 ఏళ్ల వ్యక్తి ఏడేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కటక్‌లోని కాన్‌నగర్ ప్రాంతంలోని కాళికాదేవి ఆలయం వద్ద ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు 24 గంటల్లోనే ఇన్ని ఘటనలు చోటుచేసుకోవడంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత కూడా కామాంధుల్లో ఎటువంటి మార్పు రాలేదనడానికి ఈ ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
Go Back to Shorts
Odisha
rapists
girl
Crime News

More Telugu News