India: విండీస్ ముందు 171 పరుగుల లక్ష్యాన్నుంచిన టీమిండియా

  • తిరువనంతపురంలో రెండో టీ20
  • టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ అప్పగించిన విండీస్
  • రాణించిన శివమ్ దూబే, పంత్
తిరువనంతపురంలో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు కేఎల్ రాహుల్ (11), రోహిత్ శర్మ (15) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు.

అయితే, వన్ డౌన్ లో వచ్చిన శివమ్ దూబే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 30 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సులతో 54 పరుగులు సాధించాడు. కెప్టెన్ కోహ్లీ 19 పరుగులు చేసి అవుట్ కాగా, రిషబ్ పంత్ 22 బంతుల్లో 33 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. విండీస్ బౌలర్లలో విలియమ్స్ కు 2, వాల్ష్ కు 2 వికెట్లు దక్కాయి.
India
West Indies
Cricket
T20
Tiruvananthapuram

More Telugu News