Telugudesam: టీడీపీని నేను ఫినిష్ చేస్తానంటే జగన్ నవ్వుకుంటారు: కొడాలి నాని

  • ఎందుకంటే, టీడీపీని జగన్ ఆల్రెడీ ఫినిష్ చేశారు
  • చంద్రబాబునాయుడు ఓ వృద్ధ సింహం
  • ఆయన కథ క్లోజ్
ఏపీలో టీడీపీని లేకుండా చేస్తానని సీఎం జగన్ కు మాటిచ్చారా? అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు మంత్రి కొడాలి నాని ఆసక్తికర సమాధానం చెప్పారు. ‘నేను ఫినిష్ చేస్తానంటే ఆయన నవ్వుకుంటాడు. ఎందుకంటే, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఫినిష్ చేశారు’ అని అన్నారు. చంద్రబాబునాయుడు ఓ వృద్ధ సింహం, ఆయన కథ క్లోజ్ అని జోస్యం చెప్పారు.  

టీడీపీ నుంచి వైసీపీలోకి వలసల గురించి ప్రస్తావించగా.. వల్లభనేని వంశీ తనకు మిత్రుడు అని, వైసీపీలోకి ఆయన రావాలనుకున్నప్నుడు తాను పక్కనే ఉన్నానని చెప్పారు. గొట్టిపాటి రవి కూడా తమ పార్టీలోకి వస్తాడని చెబుతున్నారని అన్నారు. అతను కూడా తనకు మంచి సన్నిహితుడని చెప్పారు. రాజీనామాలతో సంబంధం లేకుండా వైసీపీలోకి రాదలచుకున్న ఎమ్మెల్యేలను రమ్మనమని జగన్ అన్నట్టయితే, ఈ పాటికి చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా పోయేదని అన్నారు. వల్లభనేని వంశీ, రాధా, తాను ‘క్లోజ్ అసోసియేషన్’ అని, రకరకాల పరిస్థితుల నుంచి వచ్చామని, తమది ఒకటే స్వభావం అని అన్నారు. ఒక గూటి పక్షులన్నీ ఒక చోట చేరినట్టు తాము కూడా కలుస్తామని చెప్పుకొచ్చారు.
Telugudesam
Chandrababu
YSRCP
Kodali Nani

More Telugu News