పెంచినవారి వద్ద, కన్నవారి వద్ద చెరో కొన్నిరోజులు ఉండాలని భవానీ నిర్ణయం!
- భవానీ తమకే కావాలంటున్న తల్లిదండ్రులు, పెంచిన తల్లి
- ఇద్దరి వద్ద ఉండాలనుకుంటున్న భవానీ
- ఆమె నిర్ణయం మేరకు పంపుతామని పోలీసుల వెల్లడి
దీనిపై పోలీసులు స్పందిస్తూ, రెండు కుటుంబాలతో మాట్లాడి భవానీ నిర్ణయం మేరకు పంపుతామని వెల్లడించారు. 15 ఏళ్ల కిందట హైదరాబాద్ లో తప్పిపోయిన భవానీ ఇవాళే కుటుంబ సభ్యులను కలుసుకుంది. 4 ఏళ్ల వయసులో కన్నవారికి దూరమైన భవానీ తాజాగా వంశీ అనే వ్యక్తి చొరవతో రక్తసంబంధీకులను మళ్లీ చూడగలిగింది. భవానీ తల్లిదండ్రులను వంశీ ఫేస్ బుక్ పోస్టు ద్వారా తెలుసుకోగలిగారు.