Bhavani: పెంచినవారి వద్ద, కన్నవారి వద్ద చెరో కొన్నిరోజులు ఉండాలని భవానీ నిర్ణయం!

  • భవానీ తమకే కావాలంటున్న తల్లిదండ్రులు, పెంచిన తల్లి  
  • ఇద్దరి వద్ద ఉండాలనుకుంటున్న భవానీ
  • ఆమె నిర్ణయం మేరకు పంపుతామని పోలీసుల వెల్లడి
బాల్యంలో తప్పిపోయిన భవానీ అనే అమ్మాయి ఇన్నాళ్లకు తన కుటుంబ సభ్యులను కలుసుకున్న ఘటన తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి కలిగించింది. అయితే, భవానీ తనకే కావాలంటూ పెంచిన తల్లి జయరాణి కోరుకుంటోంది. దాంతో భవానీ తనను పెంచినవారి వద్ద కొన్నిరోజులు, కన్నవారి వద్ద కొన్నిరోజులు గడపాలని నిర్ణయించుకుంది. ముందుగా పెంచినవారి వద్ద ఉంటానని, తర్వాత కన్నవారి వద్ద ఉంటానని తెలిపింది.

దీనిపై పోలీసులు స్పందిస్తూ, రెండు కుటుంబాలతో మాట్లాడి భవానీ నిర్ణయం మేరకు పంపుతామని వెల్లడించారు. 15 ఏళ్ల కిందట హైదరాబాద్ లో తప్పిపోయిన భవానీ ఇవాళే కుటుంబ సభ్యులను కలుసుకుంది. 4 ఏళ్ల వయసులో కన్నవారికి దూరమైన భవానీ తాజాగా వంశీ అనే వ్యక్తి చొరవతో రక్తసంబంధీకులను మళ్లీ చూడగలిగింది. భవానీ తల్లిదండ్రులను వంశీ ఫేస్ బుక్ పోస్టు ద్వారా తెలుసుకోగలిగారు.
Bhavani
Hyderabad
Vijayawada
Police
Facebook

More Telugu News