ఇంటి యజమానిని పిసినారి అంటూ తిట్టిపోసిన దొంగ!
- మధ్యప్రదేశ్ లో ఘటన
- ఇంజినీర్ నివాసంలో చోరీకి వచ్చిన దొంగ
- ఇంట్లో చిల్లిగవ్వ దొరకని వైనం
దాంతో ఏం చేయాలో తెలియక ఇంటి యజమానికి ఓ లేఖ రాశాడు. 'నువ్వో పిసినారివి, నీలాంటివాడ్ని ఎక్కడా చూడలేదు' అంటూ తన ఉక్రోషాన్ని వెళ్లగక్కాడు. కిటీకీలు తొలగించడానికే ఎంతో సమయం పట్టింది, కనీసం ఆ శ్రమకు తగిన ఫలితం కూడా దక్కలేదు మీ ఇంట్లో' అంటూ లేఖలో తన అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆ తర్వాతి రోజు ఉదయం పనివాళ్లు వచ్చి చూసేసరికి ఇంట్లో లేఖ కనిపించింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.