Gujarath business man offered Rs 1 Lakh reward to Telangana Police: తెలంగాణ పోలీసులకు గుజరాత్ వ్యాపారి నజరానా

  • లక్ష రూపాయల విరాళం ప్రకటించిన రాజుబాగోయ్
  • దిశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ పై హర్షం
  • హైదరాబాద్ వచ్చి ఈ మొత్తాన్ని అందజేస్తానన్నవ్యాపారి
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచార నిందితుల ఎనకౌంటర్ ఘటనపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ కౌంటర్ ను సమర్థిస్తూ సామాజిక మాధ్యమాల్లో పలువురు పోస్ట్ లు పెడుతూ.. రాష్ట్ర పోలీసులను అభినందిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా, తాజాగా ఎన్ కౌంటర్ పై తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ గుజరాత్ కు చెందిన ఓ వ్యాపారి తెలంగాణ పోలీసులకు లక్ష రూపాయల విరాళమిస్తానని ప్రకటించారు. బావ్ నగర్ కు చెందిన వ్యాపారి రాజుబాగోయ్ తెలంగాణ పోలీసు శాఖ సంక్షేమ నిధికి ఈ మొత్తాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. ఈ విరాళాన్ని తాను హైదరాబాద్ కు వచ్చి స్వయంగా అందజేస్తానని మీడియాకు తెలిపారు.
Gujarath business man offered Rs 1 Lakh reward to Telangana Police
Telangana
Dish convicted Encounter case

More Telugu News