తెలంగాణ పోలీసులకు గుజరాత్ వ్యాపారి నజరానా
- లక్ష రూపాయల విరాళం ప్రకటించిన రాజుబాగోయ్
- దిశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ పై హర్షం
- హైదరాబాద్ వచ్చి ఈ మొత్తాన్ని అందజేస్తానన్నవ్యాపారి
ఇది ఇలా ఉండగా, తాజాగా ఎన్ కౌంటర్ పై తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ గుజరాత్ కు చెందిన ఓ వ్యాపారి తెలంగాణ పోలీసులకు లక్ష రూపాయల విరాళమిస్తానని ప్రకటించారు. బావ్ నగర్ కు చెందిన వ్యాపారి రాజుబాగోయ్ తెలంగాణ పోలీసు శాఖ సంక్షేమ నిధికి ఈ మొత్తాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. ఈ విరాళాన్ని తాను హైదరాబాద్ కు వచ్చి స్వయంగా అందజేస్తానని మీడియాకు తెలిపారు.