అత్యాచార నిందితుడిని కోర్టు ముందే చితక్కొట్టబోయిన న్యాయవాదులు.. వీడియో ఇదిగో

  • మధ్యప్రదేశ్ లో ఘటన
  • కోర్టులో విచారణకు వచ్చిన నిందితుడు
  • న్యాయవాదుల దాడి
  • రక్షించి తీసుకెళ్లిన పోలీసులు
అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడుతున్న మృగాళ్లపై దేశ వ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.  చివరకు న్యాయవాదులు కూడా నిందితులపై దాడికి పాల్పడుతున్నారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోని ఓ న్యాయస్థానం ముందు ఓ నిందితుడిపై న్యాయవాదులు దాడికి యత్నించారు.

మైనర్ బాలికపై ఓ మృగాడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో విచారణలో భాగంగా ఆ నిందితుడిని ఈ రోజు పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. నిందితుడిని చూసిన న్యాయవాదులు ఆగ్రహానికి గురై పిడిగుద్దులు కురిపించబోయారు. ఆ నిందితుడిని పోలీసులు రక్షించి తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు మీడియాకు చిక్కాయి.  ఇటీవల దిశ ఘటనలోనూ.. నిందితులను తమకు అప్పగించాలని, వారి అంతం చూస్తామని ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
Crime News
indore
Madhya Pradesh

More Telugu News