Uttar Pradesh: ఉన్నావో ఘటనపై యూపీ అసెంబ్లీ ఎదుట ధర్నాకు దిగిన అఖిలేశ్‌ యాదవ్

  • ఉన్నావో అత్యాచార బాధితురాలి హత్య పట్ల నిరసన
  • రేపు యూపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 'శోక సభలు' 
  • చరిత్రలో ఇది ఒక చీకటి రోజన్న అఖిలేశ్
ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావో అత్యాచార బాధితురాలి హత్య పట్ల సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ రాష్ట్ర  అసెంబ్లీ ఎదుట ధర్నాకు దిగారు. ఆయనతో పాటు పలువురు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, చరిత్రలో ఇది ఒక చీకటి రోజని అఖిలేశ్ విమర్శించారు.

బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇలాంటి ఘటనలు అధికమైపోయాయని అఖిలేశ్ ఆరోపించారు. అమ్మాయిల జీవితాలను వారు కాపాడలేకపోతున్నారని, ఈ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన అన్నారు. రేపు యూపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 'శోక సభలు' నిర్వహిస్తామని ప్రకటించారు. 
Uttar Pradesh
akhilesh yadav
Crime News

More Telugu News