shivsena: ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఆహ్వానించదగినదే!: 'ఎన్ కౌంటర్'పై శివసేన

  • సామ్నాలో శివసేన కథనం
  • పోలీసులు సత్వర మార్గాన్ని అనుసరించారని ప్రశంసలు
  • ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్య
దిశ కేసులో తగిన న్యాయం జరిగిందని శివసేన పార్టీ తమ అధికారిక పత్రిక సామ్నాలో ఓ కథనం రాసుకొచ్చింది. నిందితులపై విచారణ, చార్జిషీట్, కోర్టుల చుట్టూ తిప్పడం వంటి అవసరం లేకుండా సత్వర మార్గాన్ని ఎంచుకున్నారని తెలంగాణ పోలీసులను ప్రశంసించింది.

పోలీసులు నిందితులను ఎన్ కౌంటర్ చేయడాన్ని శివసేన పార్టీ సమర్థించింది. పోలీసుల కస్టడీ నుంచి నిందితులు తప్పించుకునే అవకాశం లేదని గుర్తు చేసింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఆహ్వానించదగినదేనని చెప్పింది. కాగా, నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించడంతోనే తాము కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే.
shivsena
Hyderabad

More Telugu News