Disha: దిశ నిందితుల ఎన్ కౌంటర్ కు స్పందనగా రోజంతా టీ ఉచితం!

  • నిన్న దిశ నిందితుల ఎన్ కౌంటర్
  • విజయవాడలో టీ దుకాణం యజమాని హర్షం
  • డబ్బులు తీసుకోకుండా కస్టమర్లకు కాఫీ, టీ సప్లై
వెటర్నరీ వైద్యురాలిని అత్యంత కిరాతక రీతిలో అంతమొందించిన నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం తెలిసిందే. దీనిపై సామాన్య ప్రజలు ముక్తకంఠంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడకు చెందిన టీ దుకాణం యజమాని సత్యనారాయణమూర్తి కూడా దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సంతోషం వెలిబుచ్చారు. అంతేకాదు, రోజంతా తన దుకాణంలో టీ, కాఫీలు ఉచితంగా అందించి సంబరాలు చేసుకున్నారు.

ముగ్గురు కుమార్తెలకు తండ్రి అయిన సత్యనారాయణమూర్తిని కూడా దిశ ఉదంతం కదిలించి వేసింది. నిందితులను చంపేస్తే బాగుంటుంది అనుకున్నవారిలో ఆయనా ఒకరు! అందుకే దిశ నిందితులు ఎన్ కౌంటర్ లో హతులయ్యారని తెలిసిన వెంటనే తన స్టాల్ కు వచ్చిన వారందరికీ డబ్బులు తీసుకోకుండానే టీ, కాఫీ సప్లై చేశారు. సత్యనారాయణమూర్తి విజయవాడలోని కొత్త ప్రభుత్వాసుపత్రి వద్ద టీ దుకాణం నడుపుతున్నారు.
Disha
Encounter
Telangana
Hyderabad
Vijayawada
Tea
Coffee

More Telugu News