ఎన్ కౌంటర్ భావోద్వేగంతో మాట్లాడే అంశం కాదు: జగ్గారెడ్డి
- మా పార్టీ స్పందన కూడా తెలియాల్సి ఉంది
- ఏ వ్యవస్థ చేసే పని అదే చేయాలి
- నాడు వరంగల్ ఎన్ కౌంటర్ తర్వాత దాడులు ఆగిపోలేదు
'అమానుష ఘటనలకు పాల్పడే నిందితులను ఎవరూ వెనకేసుకురారు. కానీ, ఏ వ్యవస్థ చేసే పని వారు చేయాలి' అని ఆయన పేర్కొన్నారు. ఎన్ కౌంటర్ లతో సమస్య పరిష్కారం అయితే సంతోషమేనని, పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని ఆయన అభిప్రాయ పడ్డారు. గతంలో వై.యస్.ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరంగల్ యాసిడ్ దాడి నిందితులను ఇలానే చేశారని, ఆ తర్వాత ఆడవారిపై చాలా దాడులు జరిగాయని, ఇంకా జరుగుతున్నాయని అన్నారు.