దిశ ఎన్ కౌంటర్.. మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి మృతదేహాల తరలింపు
- పోస్టుమార్టం అనంతరం స్వస్థలాలకు మృతదేహాల తరలింపు
- చెన్నకేశవుల కుటుంబసభ్యులకు చెందిన పొలం వద్ద అంత్యక్రియలు
- ఈ రాత్రికే నిందితుల అంత్యక్రియలు?
ఎన్ కౌంటర్ లో మృతి చెందిన శివ, నవీన్, చెన్నకేశవుల మృతదేహాలకు గుడిగండ్లలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చెన్నకేశవుల కుటుంబసభ్యులకు చెందిన పొలం వద్ద ఈ అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామ పెద్దల ద్వారా చెన్నకేశవుల కుటుంబసభ్యులను పోలీసులు ఒప్పించినట్టు సమాచారం. మహ్మద్ ఆరిఫ్ అంత్యక్రియలను జక్లేర్ లో నిర్వహించనున్నారు. ఈ రాత్రికే నిందితుల అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలుస్తోంది.