ప్రభుత్వం నుంచి మాకెలాంటి కాల్ రాలేదు.. టీవీలోనే చూశా: 'ఎన్ కౌంటర్'పై దిశ సోదరి

  • ఎన్ కౌంటర్ చేయడం మంచి నిర్ణయం
  • ఇలా చేస్తేనే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగవు
  • మా కుటుంబానికి అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు 
దిశపై హత్యాచారం కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై దిశ సోదరి స్పందించారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ... నిందితులను ఉరి తీస్తారని తాము అనుకున్నామని, ఎన్ కౌంటర్ చేయడం మంచి నిర్ణయమని చెప్పారు. ఇలా చేస్తేనే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగవని ఆమె అన్నారు. దేశ వ్యాప్తంగా తమ కుటుంబానికి అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి తమకెలాంటి కాల్ రాలేదని, టీవీలోనే చూసి  ఎన్ కౌంటర్ గురించి తెలుసుకున్నానని చెప్పారు.

ఎన్ కౌంటర్ మంచి నిర్ణయమని దిశ తండ్రి తెలిపారు. తమకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. నిర్భయ కేసులో దోషులకు ఇప్పటికీ శిక్ష పడలేదని, తన కుమార్తె విషయంలో 10 రోజుల్లో మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఇప్పుడు దిశ ఆత్మకు శాంతి చేకూరుతుందని చెప్పారు.
Go Back to Shorts
Disha
Hyderabad
Crime News

More Telugu News