దిశ తల్లిదండ్రులకు నిర్భయ తల్లి చెప్పిన మాటలే నిజమయ్యాయి!
- న్యాయం కోసం ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నా
- మీ కుటుంబానికి మాత్రం సత్వర న్యాయం జరుగుతుందన్న ఆశాదేవి
- నేటి ఎన్ కౌంటర్ తో నిజమైన ఆశాదేవి వ్యాఖ్యలు
2012లో న్యూఢిల్లీ వీధుల్లో నడుస్తున్న బస్సులో ఆశాదేవి కుమార్తె, డాక్టర్ గా పనిచేస్తున్న నిర్భయను దారుణాతి దారుణంగా అత్యాచారం చేయగా, రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులకు ఇంతవరకూ శిక్ష అమలుకాలేదు.
హైదరాబాద్ లో జరిగిన పశు వైద్యురాలు దిశ హత్యాచారంపై మూడు రోజుల క్రితం స్పందించిన ఆశాదేవి, ఆమె కుటుంబానికి త్వరలోనే న్యాయం జరుగుతుందన్న ఆశాభాన్ని వ్యక్తం చేశారు. ఈ అఘాయిత్యం చాలా అనాగరికమైనదని అభివర్ణించిన ఆమె, నిందితులకు అత్యంత కఠిన శిక్ష పడుతుందని భరోసాను ఇచ్చారు. నేటి ఎన్ కౌంటర్ తో ఆమె వ్యాఖ్యలు ఫలించాయి.