కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చారు: డీకే అరుణ
- మద్యనిషేధం విధించాలని డీకే అరుణ డిమాండ్
- ఇందిరాపార్క్ లో రెండ్రోజుల పాటు దీక్ష
- సీఎం కేసీఆర్ పై విమర్శలు
ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ, కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. పబ్ లు, డ్రగ్స్ కు హైదరాబాద్ నగరం అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం కారణంగానే మహిళలపై దారుణాలు జరుగుతున్నాయని అన్నారు. దిశ ఘటనపై పార్లమెంటులో చర్చ జరిగినా సీఎం మాత్రం స్పందించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దిశ కుటుంబాన్ని కనీసం ఫోన్ లో కూడా పరామర్శించలేదని విమర్శించారు.