Pawan Kalyan: ఇప్పుడు మోదీ, అమిత్ షా గురించి వినసొంపుగా మాట్లాడుతున్నోళ్లకు గుండెమార్పిడి జరిగిందేమో!: జీవీఎల్

  • బీజేపీతో ఎప్పుడూ విభేదించలేదని పవన్, టీడీపీ చెప్పుకుంటున్నాయి
  • కేంద్ర పెద్దలు, అమిత్ షా అంటే గౌరవమని అంటున్నారు
  • అమిత్ షాపై గతంలో రాళ్లు వేయించింది వీళ్లేగా
గతంలో బీజేపీ, నరేంద్ర మోదీ, అమిత్ షా లపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ నాయకులు విమర్శలు చేసిన విషయాన్ని ఎంపీ జీవీఎల్ ప్రస్తావించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ రెండు పార్టీలకు చురకలంటించారు. బీజేపీతో తాము ఎప్పుడూ విభేదించలేదని, ఆ పార్టీతోనే కలిసి ఉన్నామని పవన్ కల్యాణ్, టీడీపీ నాయకులు ఈమధ్య చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

కేంద్ర పెద్దలు, అమిత్ షా అంటే తమకు గౌరవమని చెబుతున్న టీడీపీ నాయకులే ఆయనపై గతంలో రాళ్లు వేయించారని ఆరోపించారు. నరేంద్ర మోదీని, అమిత్ షాను దుర్భాషలాడిన వాళ్లే ఇప్పుడు వినసొంపుగా వుండే వ్యాఖ్యలు చేస్తున్నారని, 'వాళ్లకు గుండెమార్పిడి ఏమన్నా జరిగిందేమో' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Pawan Kalyan
Chandrababu
modi
amithshah
Gvl
BJP
Telugudesam
Janasena

More Telugu News