Janasena: మహిళలందరికీ పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలి: డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి డిమాండ్

  • పవన్ వ్యాఖ్యలు మహిళల మనోభావాలు దెబ్బతీశాయి
  • ఆడపిల్లల మానప్రాణాలంటే అంత చులకనా?
  • ఏపీలో మహిళల రక్షణ కోసం కొత్త చట్టం తీసుకొస్తాం
రేపిస్టులకు రెండు బెత్తం దెబ్బలు సరిపోతాయన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమని  ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అన్నారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఆడపిల్లల మానప్రాణాలంటే అంత చులకనా? అని ప్రశ్నించారు. పవన్ వ్యాఖ్యలు మహిళల మనోభావాలను దెబ్బతీశాయని, మహిళలందరికీ ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో మహిళల రక్షణ కోసం కొత్త చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు.

వైసీపీ నేత దేవినేని అవినాశ్ మాట్లాడుతూ, దిశ కేసులో నిందితులను కాపాడే విధంగా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. మొన్నటి ఎన్నికల్లో రెండు చోట్లా ఓటమిపాలైన పవన్ కు మతిభ్రమించిందని, అందుకే, ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
Janasena
Pawan Kalyan
Deputy cm
pushpa srivani

More Telugu News