ఢిల్లీని దట్టంగా కమ్మేసిన పొగమంచు... విమానాల రాకపోకలకు అంతరాయం!
- 10 మీటర్ల దూరం కూడా కనిపించకుండా పొగమంచు
- నాలుగు విమానాల దారిమళ్లింపు
- పలు విమానాల ఆలస్యం
హైదరాబాద్, బెంగళూరు, శ్రీనగర్ వెళ్లాల్సిన విమానాలు ఆలస్యంగా బయలుదేరుతాయని విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. పొగమంచు కారణంగా 4 విమానాలను దారి మళ్లించామని, పరిస్థితి మెరుగుపడిన తరువాత అవి తిరిగి న్యూఢిల్లీ చేరుతాయని అధికారులు వ్యాఖ్యానించారు.