Narayana: ఏపీ మాజీ మంత్రి నారాయణ కాలర్ పట్టుకున్న విద్యార్థి సంఘం నేత... వీడియో ఇదిగో!

  • అనంతపురంలో పర్యటించిన నారాయణ
  • అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని నిరసన
  • కాలేజీలు మూసివేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్
ఏపీ మాజీ మంత్రి నారాయణ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఆయన్ను విద్యార్థి సంఘాలు నిలదీసిన వేళ, ఓ యువకుడు అతని కాలర్ పట్టుకుని నిలదీశాడు. ఈ ఘటన అనంతపురంలో జరిగింది. అనంత పర్యటనకు నారాయణ వెళ్లగా, ఆయన కాలేజీల్లో ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారని విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి.

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కాలేజీలు నడుపుతున్నారని, వాటిని మూసివేయాలని ఆవుల రాఘవేంద్ర అనే యువకుడు నారాయణను అందరి ముందూ పట్టుకుని నిలదీశాడు. పక్కనే ఉన్న కొందరు అతన్నుంచి నారాయణను విడిపించి, కారు దగ్గరకు చేర్చగా, ఆయన వెళ్లిపోయారు. రాఘవేంద్ర వైసీపీ విద్యార్థి విభాగం నేతగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Narayana
Ex Minister
Anantapur District
Raghavendra
Protest

More Telugu News