చదివించేందుకు తండ్రి పడుతున్న కష్టం చూడలేక... తనువు చాలించిన కుమార్తె!
- ప్రకాశం జిల్లా చీరాలలో ఘటన
- సౌదీలో పనిచేస్తూ కుమార్తెను చదివించిన రాంబాబు
- డబ్బుకు ఇబ్బందులు పడుతున్నాడని ఆత్మహత్య
తాను డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నా, కుమార్తె కోరికను కాదనలేకపోయిన రాంబాబు, హైదరాబాద్ లోని ఓ కోచింగ్ సెంటర్ లో మాట్లాడాడు కూడా. అయితే, ట్యూషన్ ఫీజు కట్టేందుకు అతని వద్ద డబ్బులు లేవు. డబ్బుల కోసం తండ్రి పడుతున్న కష్టాన్ని చూసిన వైష్ణవి, నిన్న ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుంది. కుమార్తె మరణాన్ని చూసి రాంబాబు బోరున విలపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.