హృద్రోగ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ముషారఫ్
- 2016లో చికిత్స కోసం దేశం విడిచిన ముషారఫ్
- అప్పటి నుంచి దుబాయ్‌లోనే తిష్ట
- దేశద్రోహం కేసులో ఎల్లుండి తీర్పు
3 నవంబరు 2007లో ముషారఫ్ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారంటూ ముషారఫ్‌పై కేసు నమోదు కాగా, ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. ఈ కేసులో తమ ఎదుట హాజరుకావాలంటూ ముషారఫ్‌కు కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసింది. అయినప్పటికీ ఆయన నుంచి స్పందన లేకపోవడంతో ఈ కేసును ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించింది. ముషారఫ్‌ను అరెస్ట్ చేయాలని ఆదేశించింది.