Devineni: దేవినేని ఉమపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని

  • దేవినేని ఉమ ఓ మనిషిగా పుట్టాల్సినోడు కాదు
  • పదవి కోసం వదినను చంపాడు
  • ఇంకా అతని గురించి మాట్లాడుకోవడం కరక్టేనా?
టీడీపీ నేత దేవినేని ఉమపై ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘దేవినేని ఉమ ఓ మనిషిగా పుట్టాల్సినవాడు కాదు. పదవి కోసం వదినను చంపాడు. ఇంకా అతని గురించి మాట్లాడుకోవడం కరక్టేనంటారా?’ అని ప్రశ్నించారు.

'ఇంకా అతనికి ఉచ్ఛనీచాలు ఏముంటాయి? బ్రోకర్ పనులు ఏవైనా చేస్తాడు' అంటూ దేవినేనిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డబ్బు, పదవి కోసం, చంద్రబాబుకు భజన చేస్తూ, సూట్ కేసులు మోస్తూ మొన్నటి వరకూ బ్రోకర్ పని చేశాడని ఆరోపించారు. చంద్రబాబుకు దేవినేని ఏదైతే చేశాడో, రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ కూడా సీఎం జగన్ కు అదే చేస్తున్నారని అనుకుంటాడంటూ విరుచుకుపడ్డారు.
Devineni
Uma
YSRCP
Kodali Nani
Minister

More Telugu News