Pawan Kalyan: వాళ్లకి తెలుగు సినిమాలు కావాలి, తెలుగులో డబ్బులు సంపాదించుకోవడం కావాలి: పవన్ కల్యాణ్

  • తిరుపతిలో పవన్ సమావేశం
  • తెలుగు హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు
  • వాళ్లకు రాయడం రాదని వెల్లడి
తిరుపతిలో తెలుగు పాండిత్యంపై ఏర్పాటు చేసిన సమావేశంలో జనసేనాని పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలామంది తెలుగు హీరోలకు తెలుగు రాయడం సరిగారాదని, కొందరు సరిగా ఉచ్చరించలేరని పేర్కొన్నారు. వారికి తెలుగు సినిమాలు కావాలి, తెలుగులో డబ్బులు సంపాదించుకోవాలి కానీ తెలుగు మాత్రం రాయడం, పలకడం రాదు అంటూ విమర్శించారు.

"మాలో చాలామందికి రాదు. ఈ విషయంలో ఓ హీరోగా నన్ను నేను మెరుగుపర్చుకున్నాను. ఇంకొకర్ని అనేముందు మనం నేర్చుకోవాలి కదా అనిపించింది. అందుకే నేర్చుకున్నాను. నేను యాక్టింగ్ నేర్చుకుంది సరస్వతి నమస్తుభ్యం అనే శ్లోకం నేర్చుకున్న తర్వాతే. మన భాషను, సంస్కృతిని పరిరక్షించుకోకపోతే అందరం అధోగతి పాలవుతాం" అంటూ పవన్ ఆందోళన వ్యక్తం చేశారు.

Pawan Kalyan
Tollywood
Andhra Pradesh
Tirupati

More Telugu News