Police: పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనపడుతోంది: దిశ ఘటనపై లోక్ సభలో రేవంత్ రెడ్డి

  • దేశమంతటా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి
  • నిందితులకు కఠిన శిక్షలు అమలు చేయాలి
  • సంవత్సరాల తరబడి విచారణలు జరుగుతున్నాయి
దిశ ఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనపడుతోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. లోక్ సభలో దిశ ఘటనపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఇటువంటి కేసుల్లో విచారణలు సంవత్సరాల తరబడి జరుగుతున్నాయని చెప్పారు.

ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోనూ ఇటువంటి ఘటనల్లో విచారణలు జరుగుతూనే ఉన్నాయన్నారు. అయితే, హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనపై మాత్రమే స్పందించాలని రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో జరిగిన వాటిపై మాట్లాడడం ఎందుకని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నించారు. ప్రసంగాన్ని ముగించాలని సూచించారు.

దీంతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 'మోదీజీ మన్ కీ బాత్ లో చెప్పారు' అంటూ ఏదో చెప్పబోయారు.. దీంతో రేవంత్ రెడ్డిని ఇక మాట్లాడవద్దని సూచిస్తూ ఓం బిర్లా మరో సభ్యుడికి దిశ ఘటనపై మాట్లాడే అవకాశం ఇచ్చారు.
Police
Revanth Reddy
Lok Sabha

More Telugu News