Andhra Jyothy: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నా గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించాలి: ఎర్రబెల్లి దయాకర్

  • గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ఎర్రబెల్లి
  • రాధాకృష్ణకు గ్రీన్ ఛాలెంజ్ విసిరిన మంత్రి
  • ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపు
ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ న్యూస్ ఛానల్ అధినేత రాధాకృష్ణకు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా కాకతీయ యూనివర్శిటీలో మొక్కలు నాటామని ఆయన తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉందని... ఊరు చుట్టుపక్కల ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటితే అవి అడవి బాట పడతాయని చెప్పారు. తన ఛాలెంజ్ ను ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ స్వీకరించి, మొక్కలు నాటాలని కోరారు.
Andhra Jyothy
Radhakrishna
Errabelli
TRS

More Telugu News