Congress: సోనియా గాంధీ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్, ప్రియాంకా చోప్రా జిందాబాద్... నవ్వులు పూయిస్తున్న కాంగ్రెస్ నేత నినాదాల వీడియో!

  • న్యూఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీ
  • గాంధీ... అనబోయి చోప్రా అనేసిన నేత
  • క్షమాపణలు చెప్పిన సభ నిర్వాహకులు
ఓ భారీ కాంగ్రెస్ ర్యాలీ జరుగుతూ ఉంది. న్యూఢిల్లీ వేదికగా జరిగిన సభలో కాంగ్రెస్ సీనియర్ నేత సుభాష్ చోప్రా పాల్గొన్నారు. ఇదే కార్యక్రమానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అయింది. సురేంద్ర కుమార్ అనే ఓ చోటా నేత ఈ ర్యాలీని ఏర్పాటు చేశారు. ఆయన కార్యకర్తలతో నినాదాలు చేయిస్తున్న సమయంలో జరిగిన ఘటనను చూసిన వారు ఇప్పుడు తెగ నవ్వుకుంటున్నారు. తొలుత సురేంద్ర కుమార్ సోనియా గాంధీ... అనగానే, కార్యకర్తలు జిందాబాద్ అన్నారు. ఆపై కాంగ్రెస్ పార్టీ... అనగానే మరోసారి జిందాబాద్ కొట్టారు. రాహుల్ గాంధీ... అనగానే అదే స్పందన.

ఇక ఆ తరువాత జరిగింది అసలు సంగతి. ప్రియాంకా గాంధీ... అనాల్సిన సురేంద్ర పొరపాటున ప్రియాంకా చోప్రా... అనేశారు. కార్యకర్తలు జిందాబాద్ చెప్పేశారు. దీంతో అవాక్కైన కార్యక్రమ నిర్వాహకులు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇక ఈ వీడియోను చూసిన వారు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ముందురోజు రాత్రి ప్రియాంకా చోప్రా సినిమాను సురేంద్ర చూసివుంటారని అంటున్నారు. ఆమె కాంగ్రెస్ లో ఎప్పుడు చేరారని ప్రశ్నిస్తున్నారు. నెట్టింట వైరల్ అయిన వీడియోను మీరూ చూడవచ్చు.
Congress
Priyanka Gandhi
Priyanka Chopra
New Delhi

More Telugu News