Nikhil: ఇకపై రీమేక్ ల జోలికి వెళ్లనంటున్న యంగ్ హీరో

  • కొత్తదనానికి ప్రాధాన్యతనిచ్చే నిఖిల్ 
  • ఇటీవల రీమేక్ ల వైపు మొగ్గు
  • మంచి వసూళ్లను రాబడుతున్న 'అర్జున్ సురవరం'
మొదటి నుంచి కూడా నిఖిల్ కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాడు. మిగతా యువ కథానాయకులతో కలిసి విజయాలను అందుకుంటూ తన ప్రత్యేకతను చాటుతున్నాడు. అయితే క్రితం ఏడాది రీమేక్ మూవీ అయిన 'కిరాక్ పార్టీ'లో నటించాడు. ఆ సినిమా ఆయనతో పాటు అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది.

ఇక ఇటీవల ఆయన చేసిన 'అర్జున్ సురవరం' కూడా కోలీవుడ్ నుంచి కొనుక్కొచ్చిన కథనే. ఈ సినిమా మాత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. దాంతో ఇకపై నిఖిల్ రీమేక్ లకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ 'ఇకపై రీమేక్ సినిమాలు చేయను' అనే విషయాన్ని ఆయన స్పష్టం చేయడం ఆశ్చర్యకరం. పాపం రీమేక్ సినిమాల వలన ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయోగానీ, కుర్రాడు గట్టి నిర్ణయమే తీసుకున్నాడని చెప్పుకుంటున్నారు.
Nikhil

More Telugu News