మెక్సికోలో డ్రగ్స్ ముఠాకు, భద్రతా దళాలకు మధ్య భీకర ఎదురుకాల్పులు.. 19 మంది మృతి
- దుండగులున్న భవనాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు
- కొన్ని గంటలపాటు ఎదురుకాల్పులు
- మృతుల్లో ఇద్దరు పౌరులు, నలుగురు పోలీసులు
అప్రమత్తమైన భద్రతా దళాలు కూడా కాల్పులు ప్రారంభించడంతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. కొన్ని గంటలపాటు జరిగిన కాల్పుల్లో మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 13 మంది డ్రగ్స్ ముఠాకు చెందిన వారు కాగా, ఇద్దరు పౌరులు, మరో నలుగురు పోలీసులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో ఆరుగురు గాయపడ్డారు. ఎన్కౌంటర్ అనంతరం ఘటనా స్థలం నుంచి 14 ట్రక్కులు, పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.