రెండు వార్తా పత్రికలపై ఫిర్యాదు చేశాను.. నాపై రాసిన వార్తలు నిజమని రెండు రోజుల్లో నిరూపించాలి: రాజిరెడ్డి
- దినపత్రికల్లో అసత్య వార్తలను ప్రచురించారు
- నా పేరున బస్సులు, ఇతర వ్యాపారాలు ఉన్నట్లు రుజువు చేయాలి
- ఆర్టీసీలో బినామీగా వ్యాపారం చేస్తున్నట్లు పత్రికల్లో ప్రచురించారు
తన పేరున బస్సులు, ఇతర వ్యాపారాలు ఉన్నట్లు వార్తల్లో ప్రచురించారని రాజిరెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని రెండు రోజుల్లో ఆ పత్రికలు రుజువు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాను ఆర్టీసీలో బినామీగా వ్యాపారం చేస్తున్నట్లు పత్రికల్లో ప్రచురించారని తెలిపారు.
తాను ఆ రెండు పత్రికలపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఫిర్యాదు చేశానని రాజిరెడ్డి అన్నారు. ఆ రెండు దినపత్రికలపై చట్టపరమైన చర్యలకు ముందుకు వెళ్తానని చెప్పారు. తాను ప్రజారవాణా వ్యవస్థ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నానన్నారు.