రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ నిర్మాత తోట రామయ్య దుర్మరణం!
- సికింద్రాబాద్ లో రోడ్డు ప్రమాదం
- సోమవారం నాడు అంత్యక్రియలు
- సంతాపం తెలిపిన టాలీవుడ్ ప్రముఖులు
శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరుగగా, ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రామయ్య మరణించారు. రామయ్య అంత్యక్రియలు సోమవారం నాడు బన్సీలాల్ పేట శ్మశాన వాటికలో జరపనున్నామని కుటుంబీకులు తెలిపారు. రామయ్య మృతిపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు.