సగం గడ్డం, మీసంతో క్రికెటర్ జాక్వెస్ కలిస్!
- ఈ నెలాఖరు వరకు ఇలాగే ఉంటా
- ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన క్రికెటర్
- ఖడ్గమృగాల పరిరక్షణ, గోల్ఫ్ క్రీడ అభివృద్ధికోసమే ఈ సాహసమన్న కలిస్
దీనిపై మీడియా ఆరా తీయాగా, అంతరించిపోతున్న ఖడ్గమృగాల పరిరక్షణ, గోల్ఫ్ క్రీడ అభివృద్ధికి విరాళాలు సేకరించాలనే ఉద్దేశంతో తాను గడ్డం, మీసాలు సగమే తీయించుకున్నానని తెలిపాడు. ఈ చిత్రాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేయగా అభిమానులనుంచి లైక్ లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు నాలుగు లక్షల ఎనబైవేల రాండ్స్(దక్షిణాఫ్రికా కరెన్సీ) విరాళాల రూపేణ సేకరించామన్నాడు. ఈ నెలాఖరువరకు ఇలాగే ఉంటానని ట్వీట్ చేశాడు.