Pragya sing MP: ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పై చర్యలు.. పార్లమెంటరీ కమిటీ నుంచి తొలగింపు

  • గాడ్సే దేశభక్తుడంటూ చేసిన వ్యాఖ్యల ఖండన
  • రక్షణశాఖ పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటన  
  • ఈ విడత పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు రావొద్దంటూ ఆదేశాలు
జాతిపిత మహాత్మా గాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సే దేశ భక్తుడంటూ బుధవారం లోక్ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ  ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పై బీజేపీ వేటు వేసింది. రక్షణశాఖపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ నుంచి అమెను తొలగిస్తున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ప్రకటించారు. అంతేకాక ఈ విడత జరుగుతున్న పార్లమెంటరీ పార్టీ సమావేశాల నుంచి కూడా ప్రజ్ఞా సింగ్ ను దూరంగా ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. 
Pragya sing MP
Loksabha
comments on Gadse

More Telugu News