Rammohan Naidu: డీజీపీ స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడడం తగదు... స్వేచ్ఛ అంటే రాళ్లు విసరడం, హింసకు పాల్పడడమా?: రామ్మోహన్ నాయుడు

  • అమరావతి పర్యటనలో చంద్రబాబు కాన్వాయ్ పై దాడి
  • చెప్పులు, రాళ్లు విసిరిన దుండగులు
  • ట్విట్టర్ లో స్పందించిన రామ్మోహన్ నాయుడు
టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు అమరావతి పర్యటనలో చెప్పులు విసరడం, రాళ్లు విసరడం వంటి ఘటనలపై డీజీపీ సవాంగ్ వ్యాఖ్యలపై రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ, భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై డీజీపీ అంతటి ఉన్నతస్థాయి అధికారి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని ట్వీట్ చేశారు.

"రాళ్లు విసరడం స్వేచ్ఛ అనిపించుకోదు, హింసకు పాల్పడడం స్వేచ్ఛ అనిపించుకోదు. చంద్రబాబునాయుడు గారి వాహనంపై దాడి, దాడికి పాల్పడిన వారిపై డీజీపీ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు" అంటూ వ్యాఖ్యానించారు.
Rammohan Naidu
Telugudesam
DGP
Gautam Sawang
Chandrababu
Amaravathi

More Telugu News