యువకుడి వేధింపులు తాళలేక.. ట్యాంక్ బండ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని వెళ్లిన అమ్మాయి
- ఆత్మహత్య చేసుకుంటానని తండ్రికి లేఖ
- హాస్టల్ గదిలో మంచంపై దొరికిన లేఖ
- నారాయణ గూడలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతోన్న అమ్మాయి
తన కుమార్తెను ఓ వ్యక్తి వేధిస్తున్నట్లు నారాయణ గూడ పోలీసులకు ఆమె తండ్రి నిన్ననే ఫిర్యాదు చేసి వెళ్లారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంతలోనే ఆ విద్యార్థిని ట్యాంక్ బండ్ నుంచి దూకి చనిపోతానని తండ్రికి లేఖ రాసి వెళ్లింది.