వరంగల్ యువతి హత్యకేసును కొన్ని గంటల్లోనే ఛేదించిన పోలీసులు
- పుట్టినరోజు నాడే శవమైన అమ్మాయి
- నిందితుడు తెలిసినవాడే!
- అత్యాచారం చేసి ఆపై హత్య
డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న సాయికుమార్ కు యువతితో కొన్ని నెలల కిందటే పరిచయం అయింది. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఫోన్ చేసి కాజీపేటకు రావాలని సూచించాడు. అక్కడికి కారులో చేరుకున్న సాయికుమార్ ఆ యువతిని ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని ఎక్కడైనా పడవేసేందుకు ఫ్రెండ్స్ ను సాయం కోరగా, వారు హడలిపోయారు.
దాంతో కారులోనే మృతదేహాన్ని ఉంచుకుని వరంగల్ నగరంలోకి వచ్చి ఓ షాపులో కొత్త దుస్తులు కొని ఆ అమ్మాయి మృతదేహానికి వేశాడు. రాత్రి మృతదేహాన్ని విష్ణుప్రియ గార్డెన్ సమీపంలో పడేసి వెళ్లిపోయాడు. స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.