అజిత్ పవార్ కు పదవిపై నిర్ణయం ఎన్సీపీ అధినేతదే!: సంజయ్ రౌత్

  • నాకు తెలియదు.. ఇది ఎన్సీపీకి సంబంధించిన విషయం
  • మా కూటమిలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సీనియర్ నాయకుడు
  • ఎన్సీపీ నేతలకు ఏ పదవి ఇవ్వాలన్న విషయంపై ఆయనదే నిర్ణయం 
మహారాష్ట్రలో ముందుగా బీజేపీతో చేతులు కలిపి, చివరికి మళ్లీ సొంత గూటికే చేరిన ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ కు ఉద్ధవ్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి దక్కనుందన్న ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. దీనిపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందించారు.

అజిత్ పవార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు సంజయ్ రౌత్ సమాధానం చెబుతూ... 'నాకు తెలియదు.. ఇది ఎన్సీపీకి సంబంధించిన విషయం. మహా వికాస్ అఘాడిలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సీనియర్ నాయకుడు. అజిత్ పవార్ కు గానీ, ఇతర ఎన్సీపీ నేతలకు గానీ ఏ పదవి ఇవ్వాలన్న విషయంపై ఆయనే నిర్ణయం తీసుకుంటారు' అని వ్యాఖ్యానించారు. కాగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.
Go Back to Shorts
Ajit Pawar
Shiv Sena
Maharashtra

More Telugu News