Telugudesam: చంద్రబాబును, లోకేశ్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు: చినరాజప్ప విమర్శలు

  • టీడీపీ హయాంలో అవినీతి జరిగిందని ఆరోపించారు
  • అధికారంలో వున్న జగన్ ఎందుకు విచారణ జరిపించడం లేదు?
  • రాజధాని అవసరాన్ని జగన్ గుర్తించాలి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుని, నారా లోకేశ్ ను తిట్టడమే మంత్రులు పనిగా పెట్టుకున్నారని ఆ పార్టీ నేత చినరాజప్ప విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ హయాంలో అవినీతి జరిగిందని ఆరోపణలు గుప్పించిన జగన్, ఇప్పుడు విచారణ జరిపి చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి గురించి ఆయన మాట్లాడారు. రాజధాని అవసరాన్ని జగన్ గుర్తించాలని సూచించారు. రాష్ట్రంలో పెట్టిన పెట్టుబడులన్నీ ఇప్పటికే వెనక్కి వెళ్లిపోయాయని విమర్శించారు. రాజధాని గురించి మంత్రి బొత్స సహా కొందరు మంత్రులు తమ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 
Telugudesam
Nimmakayala Chinarajappa
Jagan
cm

More Telugu News