‘ఏపీ మంత్రికి పీఏ’నంటూ మోసాలు.. నిందితుడి అరెస్టు

ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతంరెడ్డికి తాను పీఏ నంటూ మోసాలకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ పీఏగా చలామణి అవుతున్న ఆ వ్యక్తి పేరు వంశీ కృష్ణారెడ్డి. కోటి రూపాయలకు పైగా వసూలు చేశాడు. ఈ విషయం తన దృష్టికి రావడంతో గౌతంరెడ్డి అసలు పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి కారు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వంశీరెడ్డి అంతర్జాతీయ నేరస్తుడిగా పోలీసులు గుర్తించినట్టు సమాచారం.


More Telugu News