'సాఫ్ట్ వేర్ సుధీర్' నుంచి ట్రైలర్ రిలీజ్

  • 'జబర్దస్త్' ద్వారా పాప్యులర్ అయిన సుధీర్ 
  • 'సాఫ్ట్ వేర్ సుధీర్'తో హీరోగా పరిచయం
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా పాప్యులర్ అయిన ఆర్టిస్టులలో 'సుడిగాలి' సుధీర్ ఒకరు. ఇంతవరకూ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను పోషిస్తూ వచ్చిన సుధీర్, ఇప్పుడు హీరో అయ్యాడు. ఆయన హీరోగా 'సాఫ్ట్ వేర్ సుధీర్' సినిమా నిర్మితమైంది. శేఖర్ రాజు నిర్మించిన ఈ సినిమాకి రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా వ్యవహరించాడు.

ధన్యాబాలకృష్ణ కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సుధీర్ తన మార్కు కామెడీతో బాగానే నవ్వించనున్నాడనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ఇంద్రజ .. నాజర్ .. సాయాజీ షిండే .. పోసాని .. పృథ్వీ .. తాగుబోతు రమేశ్ .. విద్యుల్లేఖ రామన్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Go Back to Shorts
Sudigali Sudheer
Dhanya Balakrishna

More Telugu News