Kadapa: 'ఏయ్.. ఏయ్...' అంటూ చంద్రబాబు వారిస్తున్నా... దాడికి దిగిన తెలుగు తమ్ముళ్లు.. వీడియో ఇదిగో!

  • కడప నియోజకవర్గ సమీక్షా సమావేశంలో ఘటన
  • జిల్లా అధ్యక్షుడిపై తీవ్ర విమర్శలు
  • దాడిపై పోలీసులకు కొండా సుబ్బయ్య ఫిర్యాదు
తమ పార్టీ అధినేత చూస్తున్నారన్న భయం కడప తెలుగు తమ్ముళ్లలో లేకపోయింది. నియోజకవర్గ సమావేశం రెండో రోజున చంద్రబాబునాయుడి ముందే ఒకరిపై ఒకరు దాడులకు దిగడం తీవ్ర కలకలం రేపింది. కార్యకర్తలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించగా, 15వ డివిజన్ ఇన్ చార్జ్ కొండా సుబ్బయ్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేయడంతో గొడవ మొదలైంది.

వైకాపా నేతలకు ఆయన దగ్గరవుతున్నారని సుబ్బయ్య ఆరోపించగా, శ్రీనివాసరెడ్డి వర్గీయులు స్పందించారు. సుబ్బయ్య చేతిలోని మైకును లాక్కుని దాడికి పాల్పడ్డారు. 'ఏయ్ ఏయ్..' అంటూ చంద్రబాబు వారిస్తున్నా వినకుండా కొట్టారు. ఈ ఘటనపై సుబ్బయ్య వర్గీయులు రిమ్స్ ఔట్ పోస్ట్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమను దళితులన్న చిన్నచూపు చూస్తున్నారని ఈ సందర్భంగా సుబ్బయ్య ఆరోపించారు. 

Kadapa
Chandrababu
Telugudesam

More Telugu News