Botsa Satyanarayana: రాస్తే.. రాసుకోండి, నాకేం భయంలేదు: బొత్స సత్యనారాయణ

  • విభజనకంటే బాబు పాలనలోనే ఎక్కువ నష్టం జరిగింది
  • రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టేశారు
  • మాట వరుసకే శ్మశానం అన్నాను
ఏపీ రాజధాని అమరావతిలో చంద్రబాబు పర్యటనను వ్యతిరేకిస్తూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ‘శ్మశానం’ వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తడంతో మంత్రి స్పందించారు. ఏదో మాట వరసకు అన్నానని వివరణ ఇచ్చారు. అంత మాత్రానికే వార్తలు రాసేస్తారా? అని ప్రశ్నించారు. ఏదైనా ఓ విషయంపై మాట్లాడేటప్పుడు మాట వరుసకు సామెతలు చెబుతుంటామని, అంతమాత్రాన రాసేస్తారా? అని మండిపడ్డారు.

అంతేకాదు, ఇష్టం వచ్చినట్టు రాసుకున్నా తనకేమీ భయం లేదన్నారు. విజయనగరం కలెక్టరేట్‌లో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. విభజన వల్ల కలిగిన నష్టం కంటే టీడీపీ పాలన వల్ల 100 రెట్ల నష్టం జరిగిందని బొత్స ఆరోపించారు. విడిపోయిన రాష్ట్రాన్ని బాగు చేస్తారని చంద్రబాబుకు పాలన అప్పగిస్తే అభివృద్ధిని 20 ఏళ్లు వెనక్కి నెట్టేశారని బొత్స మండిపడ్డారు.
Botsa Satyanarayana
amaravathi
Chandrababu

More Telugu News