ఆ సినిమా నుంచే చిరంజీవి 'డైనమిక్' హీరో అయ్యారు: నటుడు నారాయణరావు
- చిరంజీవితో కలిసి నటించాను
- ఆయనతో 'దేవాంతకుడు'నిర్మించాను
- అప్పుడు చిరంజీవి ఆ మాట అన్నారన్న నారాయణరావు
నాతో పాటు సుధాకర్ - హరిప్రసాద్ కూడా చిరంజీవికి మంచి స్నేహితులు. వాళ్లకి కూడా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో తనతో మరో సినిమా చేసుకోమని చిరంజీవి అన్నారు. దాంతో మేము ముగ్గురం కలిసి చిరంజీవితో 'యముడికి మొగుడు' సినిమాను నిర్మించాము. 'డైనమిక్ మూవీ మేకర్స్' అనే బ్యానర్లో ఆ సినిమా చేస్తూ, చిరంజీవికి 'డైనమిక్' హీరో అనే బిరుదును ఇచ్చింది కూడా మేమే. ఆ సినిమా ఏ స్థాయిలో విజయవిహారం చేసిందో అందరికీ తెలిసిందే" అని చెప్పారు.