జయలలిత జీవితంపై ఒకేసారి మూడు సినిమాలు.. కంగన సూటవలేదంటూ విమర్శలు!
- రెండు సినిమాలు, ఓ వెబ్ సిరీస్
- జయ పాత్రకు కంగన సూట్ కాలేదంటూ విమర్శలు
- శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న మూడు చిత్రాలు
‘క్వీన్’, ‘ది ఐరన్ లేడీ’ సినిమాలకు సంబంధించి ఫస్ట్ లుక్ ఇప్పటికే బయటకు వచ్చింది. తాజాగా, ‘తలైవి’ సినిమా నుంచి కూడా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దీంతో ఈ మూడింటిలో జయలలిత పాత్రకు ఎవరు సూటయ్యారన్న చర్చ ఇప్పుడు మొదలైంది. క్వీన్, ఐరన్ లేడీ సినిమా ఫస్ట్‌లుక్‌లపై మంచి స్పందన కనిపించగా, ‘తలైవి’లో కంగన పాత్రలో సహజత్వం కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.