Ganguly: కోహ్లీకి కప్పు అందజేస్తుంటే సీరియస్ గా ఉన్న గంగూలీ... నెట్టింట ఆడేసుకున్న కుమార్తె సనా!

  • ఇటీవలే కోల్ కతాలో టెస్ట్ మ్యాచ్
  • ప్రెజెంటేషన్ సమయంలో సీరియస్ గా గంగూలీ 
  • వైరల్ అయిన తండ్రీ కూతుళ్ల ట్వీట్లు

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ గా, ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ, ఇటీవలే ఇండియాలో తొలి డే అండ్ నైట్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ని విజయవంతం చేసిన సంగతి తెలిసిందే. తన సొంత గడ్డపై జరిగిన ఈ మ్యాచ్ ని సక్సెస్ చేయాలని గంగూలీ ఎంతో తపించాడు. ఆయన అనుకున్నట్టుగానే మ్యాచ్ జరిగిన మూడు రోజులూ స్టేడియం నిండిపోయింది. ఊహించినట్టుగానే ఇండియా గెలిచింది.

ఇక మ్యాచ్ అనంతరం కెప్టెన్ కోహ్లీకి ట్రోఫీని అందిస్తున్న వేళ, గంగూలీ చాలా సీరియస్ గా చేతులు కట్టుకుని నిలబడి కనిపించాడు. దీనిపై నెట్టింట పలు కామెంట్లు వినిపించాయి. తాజాగా గంగూలీ కుమార్తె సనా గంగూలీ, ఇదే ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ, 'మీకు అంతగా నచ్చనిది ఏంటి?' అని సరదాగా ట్రోల్ చేస్తూ ప్రశ్నించింది.

దీనికి గంగూలీ స్పందిస్తూ 'నువ్వు అవిధేయంగా మారిపోతున్నావు... అదే' అని జవాబిచ్చాడు. వెంటనే సనా స్పందిస్తూ, 'దాన్ని నేను మీ నుంచే నేర్చుకున్నాను' అంటూ ఓ స్మైల్ ఇచ్చింది. ఇక ఈ సరదా సంభాషణ ఇప్పుడు వైరల్ అయింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News