బీఎస్ఎన్ఎల్,ఎంటీఎన్ఎల్ వీఆర్ఎస్ కు అనూహ్య స్పందన
- ఇప్పటివరకు 92వేల దరఖాస్తులు
- డిసెంబర్ 3న ముగియనున్న గడువు
- బీఎస్ఎన్ఎల్ లో వీఆర్ఎస్ కు లక్షమంది అర్హులు
ఈ పథకంలో భాగంగా వీఆర్ఎస్ ను ఎంపిక చేసుకున్నవారికి ఇప్పటివరకు పూర్తిచేసుకున్న సర్వీసుకుగాను ఏడాదికి 35 రోజుల వేతనం, మిగిలిన సర్వీసు కాలానికి ఏడాదికి 25 రోజుల వేతనం చొప్పున ఇవ్వనున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈ స్థాయిలో వీఆర్ఎస్ కు దరఖాస్తులు రావడం ఇదే ప్రథమమని అధికార వర్గాలు తెలుపుతున్నాయి.